క్లీన్‌స్వీప్‌పై గురి..

  • రోహిత్‌, కోహ్లికి కీలకం
  • నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో చివరి టి20.. రాత్రి 7.00 గం||లకు

బెంగళూరు: మూడు టి20ల సిరీస్‌లను 2-0తో చేజిక్కించుకున్న టీమిండియా.. ఇక క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి తోడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆఫ్ఘనిస్తాన్‌పై ఆశించిన స్థాయిలో బ్యాట్‌ ఝుళింపిచలేకపోయారు. యశస్వి జైస్వాల్‌, శివమ్‌ దూబే అద్భుత ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ రాణించడంతోనే తొలి రెండు టి20ల్లో భారత్‌ సునాయాసంగా నెగ్గింది. అలాగే ఈ రెండు మ్యాచుల్లోనూ భారత్‌ లక్ష్యాన్ని ఛేదించిన మ్యాచ్‌లే. ఇక బెంగళూరు మైదానంలో టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌కు వచ్చిన పంత్‌.. చిన్నస్వామి స్టేడియంలో విరాట్‌ కోహ్లీ, రింకూ సింగ్‌లతో కలిసి సందడి చేశాడు. మొహాలీ, ఇండోర్‌ వేదికగా ముగిసిన మ్యాచ్‌లలో టీమిండియా ఘన విజయాలు సాధించింది. రెండు మ్యాచ్‌లలోనూ ఛేదన చేసిన భారత్‌.. అఫ్గాన్‌ నిర్దేశించిన లక్ష్యాలను అలవోకగా సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలించే చిన్నస్వామి పిచ్‌ (బెంగళూరు)పైనా ఇదే జోరును కొనసాగించి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్‌-అమెరికా వేదికగా ఐసిసి టి20 ప్రపంచ కప్‌కు ముందు భారత్‌ ఆడబోయే ఆఖరి సిరీస్‌ ఇదే. ఇదివరకే సిరీస్‌ గెలిచిన నేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

జట్లు(అంచనా)..

భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, శుభ్‌మన్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌, కుల్దీప్‌, బిష్ణోయ్, ముఖేశ్‌ కుమార్‌.

ఆఫ్ఘనిస్తాన్‌: హజ్మతుల్లా గుర్బాజ్‌, జడ్రాన్‌ (కెప్టెన్‌), నజీబుల్లా, నబి, ఒమర్జారు, ముజీబ్‌, షరాఫుద్దీన్‌, ఖ్విజ్‌ అహ్మద్‌, నూర్‌ అహ్మద్‌/నవీన్‌, ఫారూఖీ.

➡️