టిటి ఛాంప్స్‌ హర్మీత్‌, బైస్యా

Dec 24,2023 09:48 #Sports

జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ పంఛకుల

(హర్యానా): 85వ జాతీయ టేబుల్‌ టెన్నిస్‌(టిటి) ఛాంపియన్స్‌గా హర్మీత్‌ దేశారు, పి. బైస్యా నిలిచారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో హర్మీత్‌ 10-12, 12-10, 14-16, 11-9, 11-8, 9-11, 11-8(4-3) సెట్ల తేడాతో జి. సాథియాన్‌ను చిత్తుచేయగా.. మహిళల ఫైనల్లో బైస్యా 10-12, 11-7, 11-6, 11-9, 8-11, 11-4తో 4వ సీడ్‌ అహికా ముఖర్జీని ఓడించి తొలిసారి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. సెమీస్‌లో పి.బైస్యా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆకుల శ్రీజపై సంచలన విజయం సాధించి ఫైనల్‌ బెర్త్‌ సాధించింది.

➡️