U19 World Cup 2024: ప్రపంచ కప్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది…

Dec 12,2023 09:18 #u19-world-cup-2024
u19-world-cup-2024

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ జరగనుంది. అంతకుముందు అండర్-19 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కు శ్రీలంక చేతిలో ఉంది. అయితే, నవంబర్‌లో శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ సస్పెండ్ చేసింది. దీంతో 15వ ఎడిషన్‌ జూనియర్‌ ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికాకు మారింది.
దీని ప్రకారం…. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో ఐదు స్టేడియాల్లో టోర్నీని నిర్వహించాలని నిర్ణయించారు. బ్లూమ్‌ఫోంటైన్‌లోని మాంగాంగ్ ఓవల్, ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్ స్టేడియం, కింబర్లీలోని కింబర్లీ ఓవల్, పచెఫ్‌స్ట్‌రూమ్‌లోని జెబి మార్క్స్ ఓవల్, బెనోనిలోని విల్లోమూర్ పార్క్ స్టేడియంలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగుతాయి.
టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఆడనుంది. అయితే, డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్ జనవరి 20న బంగ్లాదేశ్‌తో తన ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది.
16 జట్లు 4 గ్రూప్..
అండర్-19 ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి దశకు చేరుకుంటాయి.

➡️