వెస్టిండీస్‌ టీ20 జట్టు ప్రకటన.. ఆండ్రీ రస్సెల్‌ రీ ఎంట్రీ

Dec 10,2023 17:45 #Sports

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును తమ జట్టును క్రికెట్‌ వెస్టిండీస్‌ ప్రకటించింది. స్టార్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌కు ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం విండీస్‌ సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇంగ్లండ్‌తో వన్డేలకు దూరమైన స్టార్‌ ఆటగాళ్లు జాసన్‌ హౌల్డర్‌, నికోలస్‌ పూరన్‌లు టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు రోవ్‌మన్‌ పావెల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. షారు హౌప్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. డిసెంబర్‌ 12న బార్బోడేస్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌తో టీ20లకు విండీస్‌ జట్టు: రోవ్‌మన్‌ పావెల్‌ (కెప్టెన్‌), షారు హౌప్‌ (వైస్‌ కెప్టెన్‌), రోస్టన్‌ చేజ్‌, మాథ్యూ ఫోర్డ్‌, షిమ్రాన్‌ హెట్‌మెయర్‌, జాసన్‌ హౌల్డర్‌, అకేల్‌ హౌసేన్‌, అల్జారీ జోసెఫ్‌, బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, గుడాకేష్‌ మోటీ, నికోలస్‌ పూరన్‌, ఆండ్రీ రస్సెల్‌, షెర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌, రొమారియో షెపర్డ్‌.

➡️