మంధాన మెరుపులు..

Mar 5,2024 08:03 #women's cricket

బెంగళూరు 198/3

బెంగళూరు: మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) సీజన్‌-2024తో రాయల్‌ ఛాలెంజర్స్‌ మహిళల జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన మెరుపులకు తోడు ఎలీసె పెర్రీ(58) అర్ధసెంచరీతో రాణించారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 198పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన యుపి కెప్టెన్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు అదిరే ఆరంభం లభించింది. మేఘన(28), మంధాన(80) కలిసి తొలి వికెట్‌కు 5.3ఓవర్లలో 51పరుగులు జతచేశారు. ఆ తర్వాత మేఘన ఔటైనా.. ఎలీసె పెర్రీ(58)తో కలిసి మంధాన 2వ వికెట్‌కు 87పరుగులు జతచేసి గట్టి పునాది వేశారు. వీరిద్దరూ ధనా ధన్‌ బ్యాటింగ్‌ చేయగా.. చివర్లో వికెట్‌ కీపర్‌ రీచా ఘోష్‌(21నాటౌట్‌; 10బంతుల్లో 2ఫోర్లు, సిక్సర్‌) రాణించారు. దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 3వికెట్లు కోల్పోయి 198పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. యుపి వారియర్స్‌ బౌలర్లు అంజలి శర్వాణి, దీప్తి శర్మ, ఎక్లేస్టోన్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఈ టోర్నమెంట్‌లో యుపిా బెంగళూరు జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడి రెండేసి మ్యాచుల్లో గెలిచి.. మరో రెండేసి మ్యాచుల్లో పరాజయాన్ని చవిచూశాయి.

స్కోర్‌బోర్డు..

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల ఇన్నింగ్స్‌: మేఘన (సి)ఆటపట్టు (బి)అంజలి శార్వాణి 28, స్మృతి మంధాన (సి)పూనమ్‌ (బి)దీప్తి 80, ఎలీసె పెర్రి (సి)పూనమ్‌ ఖెన్మార్‌ (బి)ఎక్లేస్టోన్‌ 58, రీచా ఘోష్‌ (నాటౌట్‌) 21, అదనం 2. (20ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 198పరుగులు. వికెట్ల పతనం: 1/51, 2/146, 3/188 బౌలింగ్‌: హారిస్‌ 3-0-25-0, అంజలి శార్వాణి 3-0-41-1, గైక్వాడ్‌ 3-0-43-0, ఆటపట్టు 3-0-32-0, దీప్తి శర్మ 4-0-30-1, ఎక్లేస్టోన్‌ 4-0-22-1.

➡️