మహిళల హాకీ మరో అద్భుత ప్రదర్శన

Feb 19,2024 20:58 #Hockey, #Sports
  • షూటౌట్‌లో అమెరికాపై గెలుపు

రూర్కెలా: భువనేశ్వర్‌ వేదికగా జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భారత మహిళల హాకీజట్టు మరో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. మూడ్రోజులక్రితం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను చిత్తుచేసిన అమ్మాయిలు.. ఆదివారం రాత్రి అమెరికాపైనా సంచలన విజయం సాధించింది. నిర్ణీత సమయం పూర్తయ్యేసరికి ఇరుజట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలిచినా.. షూటౌట్‌లో భారతజట్టు 2-1గోల్స్‌ తేడాతో అమెరికాపై విజయం సాధించింది. భారత్‌ తరఫున దీపిక కుమారి గోల్‌ చేయగా.. అమెరికా తరఫున ఆష్టే సీసా ఒక గోల్‌ కట్టింది. షూటౌట్‌లో ముంతాజ్‌ ఖాన్‌, సోనిక గోల్‌ చేయగా.. అమెరికా తరఫున లిV్‌ా క్రౌస్‌ మాత్రమే గోల్‌ నమోదు చేసింది. భారత మహిళల హాకీజట్టు ప్రదర్శన పట్ల చీఫ్‌ కోచ్‌ జన్నెకె స్కోప్‌మన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు అనేక పెనాల్టీ కార్నర్లు లభించినా వాటిని గోల్‌గా మలచడంలో విఫలమయ్యారని ఆమె తెలిపింది.

➡️