యశస్వీ డబుల్‌ సెంచరీ.. అరుదైన ఫీట్‌

Feb 3,2024 11:38 #Cricket, #Sports

విశాఖ : వైజాగ్‌ టెస్టులో యశస్వీ జైస్వాల్‌209 డబుల్‌ సెంచరీ కొట్టాడు. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 179తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన ఈ యంగ్‌స్టర్‌ తొలి సెషన్‌ మొదలైన కాసేటికే తొలి ద్విశతకం బాదాడు. 191 పరుగుల వద్ద షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన యశస్వీ.. ఆ మరుసటి బంతికే స్క్వేర్‌ లెగ్‌లో బౌండరీ కొట్టాడు. డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో జైస్వాల్‌ టెస్టుల్లో డబుల్‌ సెంచరీ కొట్టిన నాలుగో బ్యాటర్‌గా యశస్వీ రికార్డు నెలకొల్పాడు. అతడి కంటే ముందు సౌరభ్‌ గంగూలీ(239), వినోద్‌ కాంబ్లీ(227), గౌతం గంభీర్‌(206)లు ఈ ఫీట్‌ సాధించారు.

  • మూడో అతి పిన్న వయస్కుడిగా జైశ్వాల్‌ రికార్డు

టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరపున డ‌బుల్ సెంచ‌రీ బాదిన మూడో అతి పిన్న వయస్కుడిగా జైశ్వాల్‌ రికార్డులకెక్కాడు. జైశ్వాల్‌ 22 ఏళ్ల 37 రోజుల వయస్సులో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ(21 ఏళ్ల 35 రోజులు) తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌(21 ఏళ్ల 283 రోజులు) నిలిచాడు.

➡️