కారిడార్‌ నిర్వాసితులకు న్యాయం చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న నిర్వాసితులు, నాయకులు

ప్రజాశక్తి -నక్కపల్లి:వైజాగ్‌ – చెన్నై ఇండిస్టీల్‌ కారిడార్‌ నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, నిర్వాసితులు, నాయకులు డిమాండ్‌ చేశారు. మండలంలోని రాజయ్యపేట పంచాయతీ శివారు బోయపాడులో శనివారం నిర్వాసితులు, నాయకులు సమావేశం నిర్వహించారు. 2013 భూసేకరణ చట్టప్రకారం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. ప్రతీ సెంటు భూమికి పరిహారం, ప్రతీ నిర్వాశితుడికి రూ. 15 లక్షల ప్యాకేజీ, ఇల్లు కోల్పోయిన వారికి 25 లక్షల ప్యాకేజీ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇళ్లు కోల్పోతున్నవారికీ అనువైన ప్రదేశంలో ఇల్లు స్థలాలు ఇవ్వాలని తెలిపారు. మత్య్సకారుల ఉపాధికి ఫిషింగ్‌ జెట్టి నిర్మించాలని,సాగు భూములకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని కోరారు.ప్రజలకు హాని కలిగించే బల్క్‌ డ్రగ్‌ యూనిట్‌లను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేసిన తర్వాత మాత్రమే పనులు చేపట్టాలని, అప్పటివరకు నిలుపుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బుచ్చిరాజుపేట, అమలాపురం గ్రామ సర్పంచ్‌లు కాళ్ళ శ్రీనివాసరావు, పెదపూడి శంకర్రావు, రాజయ్యపేట ఉప సర్పంచ్‌ కొండలరావు, నాయకులు ఎం.రాజేష్‌, వి.శివ, బి.గోవిందరావు, ఎస్‌.అప్పలరాజు, పి.గంగరాజు, పి.సత్తియ్య, వి.రాజు, పి.అప్పలరాజు, పి.కోదండరావు, వి.బుజ్జి, ఎం.రాంబాబు, ఆర్‌.గోవిందరావు, క.తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

➡️