పోలీస్‌ బ్యారక్‌ను ప్రారంభించిన ఎస్‌పి

ప్రారంభిస్తున్న ఎస్‌పి తుహిన్‌సిన్హా

ప్రజాశక్తి-జి.మాడుగుల: మండల కేంద్రంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ బ్యారక్‌ను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా శుక్రవారం ప్రారంభించారు. పోలీసులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఎంతగానో ఉపయోగ పడు తుందన్నారు. నాలుగు గదులతో కూడిన బ్యారాక్‌కు ఆయన ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఏఎస్పీ దీరాజ్‌, డిఎస్పీ( సి ఆర్‌ పీఎఫ్‌) ఉదరు కుమార్‌, సీఐ రమేష్‌, ఎస్సై శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️