వాన ముసురు

వాన ముసురుజిల్లాలో ముసురు వాతావరణం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఉంటుందనే వాతావరణశాఖ హెచ్చరికల ప్రభావం కనిపిస్తోంది. ఆకాశమంతటా తెల్లటి మబ్బులతో కూడిన వాతావరణం కొనసాగుతోంది. చల్లటి గాలులతో కూడిన చలివాతావరణం కొనసాగింది. మధ్య మధ్యలో మోస్తరు జల్లుల సందడి కనిపించింది. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌ సాగుకు అవసరమైన రీతిలో వర్షపాతం నమోదు గాకపోవడం ఆందోళన కలిగించింది. రబీ సీజన్‌లో నేటి వరకు -91.2 శాతం రాష్ట్రంలోనే అత్యధిక లోటు వర్షపాతం కొనసాగుతున్న నేపథ్యం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాశక్తి- కడప ప్రతినిధిజిల్లాలోని కడప, జమ్మలమడుగు, పులి వెందుల, బద్వేల్‌ రెవెన్యూ డివిజన్లలో 36 మండలా లున్నాయి. వీటి పరిధిలోని 26 మం డలాల్లో వ్యవసాయ బోర్ల కిందకే వరి సాగు పరిమితమైంది. మిగిలిన బుడ్డశనగ, వేరుశనగ, మి నుములు, పత్తి, సోయామీన్‌ సాగుకు ఆశాజనక వర్షపాతం కోసం రైతాంగం ఎదురుచూస్తోంది. అన్నమయ్య జిల్లాలో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజ కవర్గాల్లో పండ్లతోటలతో సహా వేరుశనగ తదితర పంటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. ఖరీప్‌లో వర్షాలు కురివని నేపథ్యంలో రబీలో మోస్తరు వర్షపాతం నమోదుపై రైతులు పెం చుకున్న ఆశలు అడియాశలు అవుతుండడం గమనార్హం. పదును దాటని వర్షంజిల్లాలో పదునుపాటి వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో 51 మండలాల్లో చేతివేళ్లపై లెక్కిం చదగిన రీతిలో మోస్తరు జల్లులతో కూడిన వర్షపాతం నమోదుకు పరిమితమైంది. కడప, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియో జకవర్గ ప్రాంతాల్లో మోస్తరు జల్లులతో కూడిన వాతావరణంతో సరిపెట్టింది. ఫలితంగా కడప జిల్లా వ్యాప్తంగా 3.76 లక్షల ఎకరాల్లో 2.80 లక్షల ఎకరాల వరకు బీళ్లుగానే మిగిలి పోయాయి. రబీలో ఖరీఫ్‌ తరహా వర్షాభావ పరిస్థితులే కొన సాగుతుండడం ఆందోళన కలిగి స్తోంది. రబీలో నేటి వరకు 33 శాతం లోటు వర్షపాతం కొన సాగు తుండడం గమనార్హం.బుడ్డశనగ సాగు ప్రశ్నార్థకం! జిల్లాలోని 26 నుంచి 33 మండలాల్లో నూనె గింజల ఆధారిత పంటలు సాగు కావడం తెలిసిందే. ఖరీఫ్‌ సీజన్‌ నాటి పరిస్థితులే కొనసా గుతున్న నేపథ్యం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో ప్రధాన ధాన్య ఆధారిత పంటలైన బుడ్డ శనగ, వేరుశనగ, పత్తి, మినుములు, సోయాబీన్‌ ప్రధాన పంటల సాగుకు అవసరమైన పదును పాటి వర్షం నమోదు గాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2023-24 రబీ సీజన్‌ సాగులో నూనె గింజల ఆధారిత అత్యధిక వాటా వీటిదే. గతేడాది తరహాలోనే బుడ్డశనగ సుమారు 2,32,360 ఎకరాలు, మినుము 22,915 ఎకరాల్లో గణనీ యంగా సాగవుతోంది. వీటితోపాటు వేరుశనగ, పత్తి, సోయాబీన్‌ పంటలు సాగవుతున్నాయి. ప్రతి ఏటా అక్టోబర్‌ ఒకటి నుంచి ఆశాజ నకంగా వర్షపాతం నమోదు కావడం తెలిసిందే. గత వాతావరణ పరిస్థితులకు వ్యతిరేకంగా ఆశా జనక వాతావరణ పరిస్థితుల లేమి కారణంగా సుమారు 22 రకాల సాగు ప్రశ్నార్థకంగా మారింది.

➡️