పట్టణంలో కార్డెన్‌ సెర్చ్‌

ప్రజాశక్తి-గిద్దలూరు: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో పట్టణంలోని ఎస్టీ కాలనీ, టైలర్స్‌ కాలనీ, కొంగలవీడు రోడ్‌లోని పలు ప్రాంతాలలో గురువారం కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో పట్టణ సిఐ వైవి సోమయ్య పాల్గొన్నారు. కార్డెన్‌ సెర్చ్‌లో దస్త్రాలు లేని వాహనాలను పట్టుకున్నామని, అనుమానితులను ప్రశ్నించామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ప్రజలు పోలీసులకు సహకరించి, శాంతియుతంగా మెలగాలని కోరారు. ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, గిద్దలూరు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️