ఘర్షణలతో కుటుంబాలకు నష్టం వాటిల్లుతుంది

రెంటచింతల: మండలంలోని పాల్వా యి గేటు గ్రామంలో సోమ వారం పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. శాంతి, భద్రతల పరిరక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూ లన అసాంఘిక శక్తుల ఏరివేత దీనిముఖ్య ఉద్దేశమని గురజాల ఇన్‌ఛార్జి డిఎస్పి వెంకటేశ్వర రావు అన్నారు. గ్రామంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించి గ్రామ స్తులతో మాట్లా డుతూ ఘర్షణలు జరిగితే కుటుంబాలకు జరిగే నష్టం గురించి వారికి వివరించారు. ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా ఘర్షణలకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా గుర్తించినట్లు చెప్పారు. సరైన పత్రాలు లేని ఐదు ద్విచక్ర వాహ నాలను స్వాధీనం చేసుకున్నమన్నారు. ఎస్‌ఐ ఎం ఆంజ నేయులు స్పెషల్‌ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

పొన్నూరు : రాష్ట్రంలో జూన్‌ నాలుగో తేదీన వెలువడుతున్న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘర్షణలు, అల్లర్లకు తావివ్వకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా పొన్నూరులో సోమ వారం అర్బన్‌ పోలీసులు రూట్‌ మార్చు నిర్వహించారు. ఐదో వార్డు డఫ్‌పేట , నాలుగో వార్డ్‌ మొల్లా వారి స్ట్రీట్‌ తదితర ప్రాంతాలలో పొన్నూరు టౌన్‌ సిఐ పి. భాస్కర్‌ ఆధ్వర్యంలో స్టేషన్‌ సిబ్బందితో రూట్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ భాస్కర్‌ మాట్లాడుతూ పట్టణంలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉందని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ రాజకుమార్‌, ఏఎస్‌ఐ పిఎమ్‌. సుభాని లతోపాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️