తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌ రాజు కేంద్ర ఎన్నికల సంఘం చొరవతో నియామకం

తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌ రాజు కేంద్ర ఎన్నికల సంఘం చొరవతో నియామకం

తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌ రాజు కేంద్ర ఎన్నికల సంఘం చొరవతో నియామకం ప్రజాశక్తి- తిరుపతి సిటీ తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌ రాజు నియమితులయ్యారు. కేంద్ర సర్వీసులో ఉన్న ఈయనను కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా స్పందించి నియమించింది. తిరుపతి జిల్లాలో సాధారణ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల చివరిరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద, టిడిపి కూటమి అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు, వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి వారి అనుచరులపై నడిరోడ్డుపై రాళ్లతో దాడి చేశారు. పోలింగ్‌ రోజు రాత్రి చంద్రగిరి నియోజకవర్గ రామిరెడ్డిపల్లి పంచాయితీ కూచువారుపల్లిలో చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి, ఆ పంచాయతీ సర్పంచ్‌ చంద్రశేఖర్‌ రెడ్డిపై టిడిపి వర్గాలు దాడులు చేసి, ఒక కారును దగ్ధం చేసి, మరో కారును ధ్వంసం చేశారు. సర్పంచి ఇంటిపై పెట్రోల్‌ బాంబులతో దాడులు చేసి ఇల్లును పూర్తిగా మంటలకి ఆహుతి చేశారు. దీనిపై కక్ష పెంచుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్దనున్న స్ట్రాంగ్‌ రూమ్‌ ఎదుట టిడిపి అభ్యర్థి పులివర్తనాన్ని అతని గన్‌మెన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. బీరు బాటిల్లు ఇనుప రాడ్లు, క్రికెట్‌ బ్యాట్లు స్టిక్కులతో మహిళా వర్సిటీ ప్రాంగణంలో వీరంగం సష్టించారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో గొడవ మరింత ముదిరి, వరుసటి ప్రాంగణం మొత్తం బీభత్సంగా మారింది. ఇంత జరుగుతున్న గొడవను అరికట్టాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని, పైగా గొడవలను కవర్‌ చేసేందుకు వచ్చిన మీడియాపై లాటీలు చిలిపించారు. తిరుపతిలో జరిగిన అల్లర్లు, విధ్వంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డిజిపి లను రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు కారణాలను ఎన్నికల సంఘానికి వివరించింది. తిరుపతి అల్లర్లపై వధా సైనిక వ్యవహరించిన జిల్లా ఎస్పీ కష్ణకాంత్‌ పటేల్‌, తిరుపతి డిఎస్పి సురేందర్‌ రెడ్డిలను బదిలీ చేసి, వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించిన విషయం విధితమే. ఎన్నికల ఈసీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ కష్ణ కాంత్‌ పటేల్‌ను బదిలీ చేసింది. బదిలీ అయిన కష్ణకాంత పటేల్‌ స్థానంలో హెచ్‌.హర్షవర్ధన్‌ రాజులు నియమిస్తూ రాష్ట్ర డిజిపి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హర్షవర్ధన్‌ రాజు గతంలో విజయవాడ డిసిపిగా పనిచేశారు. తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేశారు. అనంతరం సిఐడి ఎస్పీగా పని చేస్తున్నారు. ప్రస్తుతం బీహార్‌ ఎన్నికల అబ్జర్వర్‌గా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. సమర్థవంతమైన ఎస్పీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్‌ రాజును నియమించింది. ఒకటి రెండు రోజుల్లో ఈయన బాధితులు తీసుకొనున్నట్లు సమాచారం.

➡️