భూ హక్కుల చట్టం రద్దు చేయాలి : కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు

Dec 28,2023 00:33

ప్రజాశక్తి – బాపట్ల
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఎపి భూ హక్కుల చట్టం తక్షణమే రద్దు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమా లీలాకృష్ణ ఆధ్వర్యంలో ఆర్డీఒకు వినతి పత్రం అందజేశారు. భూ హక్కుల చట్టంతో నష్టపోయే విధానాన్ని తెలియజేస్తూ పట్టణంలో వినూత్న ప్రదర్శన చేశారు. స్థానిక పాతబస్టాండ్ సెంటర్‌లో న్యాయవాదులు మానవహారంగా ఏర్పాటై భూ హక్కుల చట్టం రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఇమ్మడిశెట్టి బాలకృష్ణ, సీనియర్ న్యాయవాదులు జడ్ భాషా, నల్లమోతు సుబ్బారావు, దుద్దుకూరి శ్రీరామమూర్తి, సిహెచ్ నాగయ్య, ఫిలిప్, వై నరేష్ బాబు, ఐ సురేష్ బాబు, లేళ్ళ శ్రీనివాసరావు, బి కమలకుమార్, వై సతీష్ రాజా, స్టాలిన్, విమల్ కుమార్, డి కిరణ్ కుమార్, కె రవిబాబు, డిహెచ్ బెంజ్, తోట రామాంజనేయులు, షేక్ మన్సూర్, సిహెచ్ శరత్ చంద్ర, బండి రామ్మూర్తి, మహిళా న్యాయవాదులు ఉషారాణి, నాగమోహిని, మాధురి, ఆకాంక్ష పాల్గొన్నారు.

➡️