మంత్రిని కలిసిన పలువురు నాయకులు

ప్రజాశక్తి – రాయచోటి రాష్ట్ర రవాణా, సమాచార, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డిని రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి, టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు, రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకులు సుగవాసి ప్రసాద్‌ బాబు కలిశారు. రాంప్రసాద్‌ రెడ్డి మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకొని మొట్ట మొదటిసారిగా రాయచోటికి విచ్చేసిన సందర్భంగా ప్రసాద్‌బాబు సంజీవనగర్‌ కాలనీలో ఆయన ఇంటికి వెళ్లి పూల బొకే ఇచ్చి దశ్శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు ఏకాంతంగా పలు విషయాలపై చర్చించారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై చోటు చేసుకున్న పరిణామాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. కార్యకర్తలకు అండగా నిలిచేందుకు సూచనలు చేసు కున్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా అభివద్ధిపై పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, అందుకు తగు కార్యాచరణ ప్రణాళికలను రూపొ ందించుకున్నారు. కార్యక్రమంలో పలువురు టిడిపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాజంపేట అర్బన్‌ : రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డిని ఆదివారం రాజంపేట టిడిపి నాయకులు శాలువా, పుష్పగుచ్చంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి అండగా ఉంటానని ఈ సందర్భంగా రాంప్రసాద్‌ రెడ్డి హామీ ఇచ్చినట్లు టిడిపి నాయకులు తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి లీగల్‌ సెల్‌ అధ్యక్షులు తరిగోపుల లక్ష్మీ నారాయణ, మాజీ మండల అధ్యక్షులు బసినేని వెంకటేశ్వర్లు నాయుడు, గీతాంజలి రమణ, డాక్టర్‌ నవీన్‌ కుమార్‌, విశ్రాంత పీ.డీ షామీర్‌బాష పాల్గొన్నారు. రైల్వేకోడూరు : రాష్ట్ర రవాణా,యువత, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్ర సాద్‌రెడ్డిని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, టిడిపి యువ నాయకులు ముక్కా సాయివి కాస్‌రెడ్డిలు మర్యా ద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తనకు కేటాయించిన శాఖల నుంచి రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అంది స్తానని తెలిపారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

➡️