గాజాకు మద్దతుగా ఆస్కార్‌ నటుల నిరసన

Mar 12,2024 15:56

లాస్‌ ఏంజిల్స్‌: పాలస్తీనా అనుకూల నిరసనకారులు రోడ్డును అడ్డుకోవడంతో అవార్డు వేడుక ఆలస్యంగా ప్రారంభమైంది. గాజాలో ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న మారణహోమానికి వ్యతిరేకంగా ఆస్కార్‌ వేదికపైన, వెలుపల కూడా ఆగ్రహావేశాలు ప్రతిధ్వనించాయి. వెయ్యి మందికి పైగా నిరసనకారులు కాల్పుల విరమణను కోరుతూ ర్యాలీ నిర్వహించారు. అనేకమంది తారలు కాల్పుల విరమణను కోరుతూ రెడ్‌ బ్యాడ్జీలు ధరించారు.

‘ఆర్టిస్ట్స్‌ ఫర్‌ సీస్‌ఫైర్‌’ కలెక్టివ్‌ నేతృత్వంలో, ఆస్కార్‌ వేదిక గాజా కోసం తన స్వరం పెంచింది. నటులు రామి యూసఫ్‌, మార్క్‌ రుఫాలో, మహర్షలా అలీ, రిజ్‌ అహ్మద్‌, మిలియో మచాడో గార్నర్‌, స్వాన్‌ అర్లౌడ్‌, గాయకుడు బిల్లీ ఎలిష్‌ , దర్శకుడు అవా డువెర్నే ఎరుపు బ్యాడ్జీలు ధరించి వచ్చారు. దర్శకురాలు లారా డెల్హోర్‌ ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసి ఉన్న ప్లకార్డుతో ఆస్కార్‌ వెలుపల నిరసనలో పాల్గొన్నారు.

ఆస్కార్‌ వేడుకల్లో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న హింసను దర్శకుడు జోనాథన్‌ గ్లేజర్‌ తీవ్రంగా ఖండించారు. జోనాథన్‌ ‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ చిత్రానికిగాను ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును స్వీకరించారు. ఇజ్రాయెల్‌, గాజాలో మరణించిన వారు డీమానిటైజేషన్‌ బాధితులని ఆయన చెప్పారు.

➡️