పాలస్తీనా మద్దతుదారుల ట్వీట్లను తొలగించిన మెటా

 వాషింగ్టన్‌ :    ప్రస్తుత ఇజ్రాయిల్‌ -పాలస్తీనా యుద్ధం సమయంలో అతిపెద్ద సోషల్‌మీడియా సంస్థ మెటా పాలస్తీనా మద్దతుదారుల ట్వీట్లను తొలగించినట్లు హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ (హెచ్‌ఆర్‌డబ్ల్యు) ఓ నివేదికలో పేర్కొంది. వందలాది మంది పాలస్తీనా మద్దతుదారుల వాయిస్‌లను ప్రపంచానికి వినిపించకుండా క్రమపద్ధతిలో అణచివేసినట్లు తెలిపింది. లోపభూయిష్టమైన కంటెంట్‌ నియంత్రణ విధానాలు, పేలవమైన అమలు, ప్రభుత్వ ఒత్తిడితో మెటా వాటిని తొలగించినట్లు ఆ నివేదికలో వెల్లడించింది.

చెప్పలేని దురాగతాలు మరియు అణచివేత పాలస్తీనాను గాయపరుస్తున్న సమయంలో కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌తో పాలస్తీనాను మెటా అవమానించిందని హెచ్‌ఆర్‌డబ్ల్యు యాక్టింగ్‌ అసోసియేట్‌ టెక్నాలజీ మరియు హ్యూమన్‌ రైట్స్‌ డైరెక్టర్‌ డెబోరా బ్రౌన్‌ తెలిపారు.  ప్రజలు స్పందించేందుకు, దుర్వినియోగాలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు సోషల్‌మీడియా ఓ అత్యవసరమైన వేదిక. అటువంటిది మెటా పాలస్తీనియన్ల గొంతుకను సెన్సార్‌షిప్‌తో అణచివేస్తోందని అన్నారు. 60 దేశాల్లో మెటా సుమారు వెయ్యికి పైగా సెన్సార్‌షిప్‌ కేసులు నమోదైనట్లు హెచ్‌ఆర్‌డబ్ల్యు తెలిపింది.

➡️