బద్దలైన భారీ అగ్నిపర్వతం : జనావాసాలపై ప్రవహిస్తున్న లావా

ఐస్‌ల్యాండ్‌ : ఐస్‌ల్యాండ్‌లోని రెక్జానెస్‌ ద్వీపకల్పంలో భారీ అగ్ని పర్వతం బద్దలైంది. దీని నుంచి వెలువడిన అగ్ని పర్వతపు లావా జనావాసాలపైకి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. లావా ముప్పులో ఆ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఆ ప్రాంతంపైకి ప్రవహించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అడ్డుగా పెద్ద బండరాళ్లను పెట్టారు. కానీ ప్రయోజనం లేకపోయింది. లావా ప్రవహించడంతో స్థానికులు వెంటనే ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వారితోపాటు పెంపుడు జంతువులు, పశువులను కూడా తీసుకెళుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఐస్‌ల్యాండ్‌లో నెలరోజుల వ్యవధిలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్‌ను జనవరి 16 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం లావా ఈ ప్రదేశానికి దూరంగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

➡️