లాస్‌ వెగాస్‌ యూనివర్శిటీలో కాల్పులు .. ముగ్గురు   మృతి

వాషింగ్టన్   :    అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. లాస్‌వెగాస్‌ యూనివర్శిటీలో బుధవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని.. అతని పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. అయితే కాల్పులు జరిపిన అనుమానితుడు కూడా మరణించినట్లు లాస్‌ వెగాస్‌ మెట్రోపాలిటిన్‌ పోలీస్ డిపార్ట్ మెంట్ తెలిపింది.  ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.

➡️