ఇండోనేషియాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం..

Dec 31,2023 09:26 #Earthquake, #Indonesia

ఇండోనేషియా : ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 10.46 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్‌ స్కేల్‌పై 6.2గా నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇండోనేషియా వాతావరణ విభాగం సునామీ ప్రమాదమేమీ లేదని, అయితే మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల భూకంప తీవ్రత 6.3, 6.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

➡️