హౌతీ రెబల్స్‌కు అమెరికా సీరియస్‌ వార్నింగ్‌

Jan 4,2024 10:48 #Houthi Rebels, #usa, #warning
  • నౌకలపై దాడులు ఆపకుంటే మిలటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిక

ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడిచేసి దోచుకుంటున్న హౌతీ రెబల్స్‌కు అమెరికా, దాని 12 మిత్ర దేశాలు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాయి. దాడులు తక్షణం ఆపకుంటే తమ మిలటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీనిపై యూఎస్‌, ఆస్ట్రేలియా, బహ్రెయిన్‌, బెల్జియం, కెనడా, డెన్మార్క్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, సింగపూర్‌, బ్రిటన్‌ దేశాలు సంతకాలు చేశాయి. ‘యెమన్‌కు చెందిన హౌతీలు నౌకలపై దాడులను నిలిపివేయాలి. చట్టవిరుద్ధంగా నిర్భందించిన నౌకలు, సిబ్బందిని వెంటనే విడుదల చేయాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే జలమార్గాల్లో బెదిరింపులకు గురి చేయడం సరికాదు. కాబట్టి అటాక్స్‌ వెంటనే ఆపకపోతే తర్వత జరిగే పరిణామాలకు హౌతీలే బాధ్యత వహించాలి’ అని పేర్కొన్నాయి. ఇప్పటికే అన్యాయంగా నిర్బంధించిన నౌకలు, సిబ్బందిని విడిచిపెట్టాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశాయి.

➡️