క్రిమియాపై దాడి వెనక అమెరికా హస్తం :  రష్యా ఆరోపణ

Jun 25,2024 07:05 #attcks, #Putin, #russia

మాస్కో: క్రిమియాపై ఉక్రెయిన్‌ క్షిపణులతో దాడి వెనక అమెరికా హస్తం ఉందని రష్యా ఆరోపించింది. రష్యన్‌ అధ్యక్ష భవనం ప్రతినిధి డిమిట్రో పెస్కోవ్‌ సోమవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ క్రిమియాపై దాడిని అనాగరిక చర్యగా పేర్కొన్నారు. ఈ దాడిలో అమెరికా ప్రమేయముందని ఆయన ఆరోపించారు.పిల్లలను చంపడం మరీ దారుణమని ఆయన అన్నారు. క్రిమియాపై ఆదివారం జరిగిన దాడిలో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు చనిపోయారు. మరో 151 మంది గాయపడ్డారు.

➡️