Americaలో మరో భారతీయ విద్యార్థి మృతి

Apr 6,2024 08:16 #America, #Another, #died, #Indian student

న్యూయార్క్‌ (అమెరికా) : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధ్రువీకరించింది. ఓహియో స్టేట్‌ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి చనిపోయాడు. అయితే మృతుడి స్వస్థలంతో సహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపడానికి అవసరమైన సాయం అందిస్తామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ‘ఎక్స్‌’ ఖాతాలో తెలిపారు. ఈ ఏడాదిలో ఇది పదవ భారతీయ విద్యార్థి మరణం.

➡️