నిరాశ్రయులైన పాలస్తీనా పిల్లలపైనా దాడులు

Jun 16,2024 23:30 #atrocities, #concerned, #Israel's, #Unicef

ఇజ్రాయిల్‌ దాష్టీకాలపై యునిసెఫ్‌ ఆందోళన
న్యూయార్క్‌: నిరాశ్రయులైన పాలస్తీనా పిల్లలపై చాలా ప్రాంతాల్లో బాంబు దాడులు జరుగుతుండడం పట్ల యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాపితంగా పిల్లలకు మానవతా అభివృద్ధి సాయాన్ని అందజేసే ఈ ఐక్యరాజ్యసమితి సంస్థ గాజాలో పిల్లలు ఎదుర్కొంటున్న భయానక పరిస్థితిని స్వయంగా పరిశీలించింది. ఇజ్రాయిల్‌ చేస్తున్న బాంబు దాడుల వల్ల అక్కడి పిల్లలు నరకం అనుభవిస్తున్నారని యునిసెఫ్‌ ప్రతినిధి జేమ్స్‌ ఎల్డర్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకదానిని ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.
ఈద్‌ ఉల్‌ అజా సందర్భంగా పిల్లలు ఆకలితో అలమటించడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. దక్షిణ గాజాలో పిల్లలకు ఆహార బాక్స్‌లను గుర్తు తెలియని విమానం ద్వారా శనివారం జారవిడిచారు. బక్రీద్‌ పండగ ముందు రోజు అల్‌ మవాసి ఏరియా, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో జారవిడిచిన ఆహార బాక్స్‌ల కోసం జనం పరుగులు తీశారు.

➡️