U.S. Supreme Court తీర్పుని ఖండించిన బైడెన్‌

వాషింగ్టన్‌ :   ప్రత్యర్థి ట్రంప్‌కి అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అధ్యక్షుడు బైడెన్‌ సోమవారం ఖండించారు. అమెరికాలో రాజులు లేరనే సూత్రం ఆధారంగా ఈ దేశం నిర్మితమైందని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. అది ప్రాథమికంగా మార్చబడిందని అన్నారు.

నేరాభియోగాల విచారణ నుండి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కి మినహాయింపు కల్పిస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరిక అధ్యక్షునితో పాటు మాజీ అధ్యక్షునికి కూడా నేరాభియోగాల విచారణ నుండి మినహాయింపు ఉంటుందని జులై 1న తీర్పునిచ్చింది. ఈ తీర్పు 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి కుట్ర పన్నినందుకు విచారణ ఆలస్యం చేసే అవకాశం ఉంది.

అమెరికా అధ్యక్ష బరిలో బైడెన్‌ మరోసారి ట్రంప్‌ను ఎదుర్కోనున్నారు. 2020 ఎన్నికల్లో తాను విజయం సాధించారని ఆరోపించడంతో .. ఆయన మద్దతుదారులు 2021 జనవరి 6న అమెరికాలోని వైట్‌హౌస్‌పై దాడికి దిగారు. ట్రంప్‌ చర్యను బైడెన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు.

➡️