చోమ్‌స్కీ @ 95

Dec 8,2023 08:46 #birthday, #Celebrations, #chomsky

న్యూయార్క్‌: ప్రఖ్యాత రాజకీయ తత్వవేత్త , భాషావేత్త , బహుముఖ ప్రజ్ఞాశాలి నోమ్‌ చోమ్‌స్కీ డిసెంబరు7న 95వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఇప్పటకీి విద్యారంగంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు, 1960లలో పౌర హక్కుల ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ప్రొఫెసర్‌ చోమ్‌స్కీ అమెరికా క్యాంపస్‌లలో చోదక శక్తిగా ఉన్నారు. భాషా శాస్త్ర అధ్యయనంలోనే కాకుండా, రాజకీయ, సామాజిక న్యాయ చర్చల్లోను దిట్ట. ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన ఆలోచనాపరుడు చోమ్‌స్కీ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది.

➡️