ఐఎస్‌ఎస్‌లోకి భారత వ్యోమగామి ! : నాసా చీఫ్‌ వెల్లడి

Jun 20,2024 23:34 #Indian astronaut, #ISS, #NASA

వాషింగ్టన్‌ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి భారత్‌ నుంచి వ్యోమగామిని తీసుకెళ్లేందుకు తాము కృషి చేస్తామని, అంతరిక్ష రంగంలో భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని నాసా అధిపతి బిల్‌ నెల్సన్‌ గురువారం వెల్లడించారు. రోదసీ రంగంలో భారత్‌తో సహకారాన్ని అమెరికా రోదసీ సంస్థ విస్తరిస్తుందని నెల్సన్‌ పేర్కొన్నారు. అమెరికా, భారత్‌ జాతీయ భద్రతా సలహాదారులు జేక్‌ సులివాన్‌, అజిత్‌ దోవల్‌ సోమవారం చర్చలు జరిపిన నేపథ్యంలో ఫ్యాక్ట్‌ షీట్‌ను విడుదల చేసిన నేపథ్యంలో నెల్సన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఇస్రో వ్యోమగాములకు అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు అజిత్‌ దోవల్‌ చెప్పారు. గతేడాది భారత్‌లో నెల్సన్‌ పర్యటించిన సంగతి తెలిసిందే. మానవాళి ప్రయోజనాల కోసం కీలకమైన, కొత్తగా ఆవిర్భవించే సాంకేతికతలపై అమెరికా, భారత్‌ చొరవను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నాసా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అయితే ఐఎస్‌ఎస్‌కు భారత వ్యోమగామిని తీసుకెళ్ళే మిషన్‌కు సంబంధించి ఇంకా వివరాలన్నీ ఖరారు చేయాల్సి వుందన్నారు.

➡️