జపాన్‌ భూకంపం.. సునామీ హెచ్చరికల ఉపసంహరణ

Jan 2,2024 11:25 #Japan, #Tsunami

జపాన్‌ : తీవ్ర భూకంపాల నేపథ్యంలో సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికలను జపాన్‌ ఉపసంహరించుకుంది. అన్ని సునామీ హెచ్చరికలు, సూచనలు, సలహాలను ఎత్తివేసినట్టు జపాన్‌ వాతావరణ సంస్థ ‘ఇషిగావా’ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కొత్త సంవత్సరం తొలి రోజున 7.6 తీవ్రతతో భారీ భూకంపం జపాన్‌ను కుదిపేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో 5 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడ్డాయి. దీంతో జపాన్‌ ప్రభుత్వం హైఅలెర్ట్‌ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఎత్తైన భవంతులు ఎక్కాలని సూచించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్య జపాన్‌లో సంభవించిన తీవ్ర భూకంపంలో కనీసం 13 మంది మరణించినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇళ్లు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఒకచోట భారీ అగ్నిప్రమాదం జరిగిందని వివరించారు.

➡️