ఇజ్రాయిలీలను నిషేధించనున్న మాల్దీవులు

మాల్దీవులు : గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణపూరిత దాడులను కారణంగా మాల్దీవులు ఇజ్రాయిలీలను దేశంలోకి రాకుండా నిషేధించనుంది. ముస్లింలు అధికంగా ఉన్న మాల్దీవులలో  గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధంపై  మాల్దీవుల ప్రజల్లో ఆగ్రహం పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ఇజ్రాయిల్ పాస్‌పోర్ట్ హోల్డర్లు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి చట్టాలను మార్చాలని, ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపింది.  పాలస్తీనా అవసరాలను అంచనా వేయడానికి, నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించడానికి అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ప్రత్యేక రాయబారిని నియమిస్తారని పేర్కొంది. గత సంవత్సరం  దాదాపు 11,000 మంది ఇజ్రాయిలీలు మాల్దీవులను సందర్శించారు. ఇది మొత్తం పర్యాటకుల రాకపోకల్లో 0.6%గా ఉంది. రఫాలో వేలాదిగా ఇజ్రాయిల్ బలగాలు మోహరించడం, ప్రతిరోజూ డజన్ల సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించడం, ఇప్పటికే 36వేల మంది చనిపోయారు. పది లక్షల మందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారు.

 

➡️