డెన్వర్ : కొలరాడో మాల్లో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొలరాడో స్ప్రింగ్స్‌లోని సిటాడెల్ మాల్లో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు కాల్పులకు దిగడంతో ఒకరు మరణించారని అన్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం సిటాడెల్ మాల్‌ను మూసివేశామని అన్నారు.