ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రబౌ సుబియాంటో విజయం

Feb 15,2024 16:24 #Indonesia, #Presidential Elections

జకార్తా :  అధ్యక్ష ఎన్నికల్లో ఇండోనేషియా రక్షణ మంత్రి ప్రబౌ సుబియాంటో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అనధికారిక ఓట్ల లెక్కింపుల్లో ప్రత్యర్థులపై ఆయన గణనీయమైన ఆధిక్యాన్ని చూపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శీఘ్రగణన బ్యాలెట్ల ఆధారంగా ప్రబౌ సుబియాంటోకు 58 శాతం ఓట్లు పోలైనట్లు స్వతంత్ర పోస్టలర్స్‌ తెలిపారు.  ఎన్నికల సంఘం ప్రాథమిక లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతోందని,  ప్రబౌకు 57.7 శాతం ఓట్లు, సుమారు 6 శాతం ఓట్లు నమోదయ్యాయని అన్నారు. ప్రత్యర్థులు అనిస్‌ బస్వెదన్‌, గంజర్‌ ప్రనోవ్‌లు వరుసగా 25 శాతం మరియు 17 శాతంతో వెనుకబడినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో నమూనా ఓట్ల ఆధారంగా శీఘ్రగణన జరుగుతుంది. ఇండోనేసియాలో ఓట్ల లెక్కింపు.. సుదీర్ఘ ప్రక్రియ.  అధికారిక ఫలితాల వెల్లడికి నెల వరకు సమయం పట్టచ్చు. 2004 నుంచి జరిగిన ప్రతి అధ్యక్ష ఎన్నికలోనూ శీఘ్రగణన అంచనాల ఆధారంగానే తుది ఫలితాలొ చ్చాయి.

అయితే అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించినట్లు ప్రబౌ సుబియాంటో ప్రకటించారు. జకార్తలోని ఓ స్టేడియంలో మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. విజయం పట్ల గర్వం, అహంకారం కూడదని, వినయంతో ఉండాలని అన్నారు. అత్యుత్సాహం కూడదని ఈ విజయం దేశ ప్రజలందరి విజయం కావాలని అన్నారు. శీఘ్ర గణన లెక్కింపుదారులకు  కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటు మాజీ అధ్యక్షుడు జొకొ విడొడొ కుమారుడు జిబ్రన్‌ రకబుమింగ్‌ రాకా కూడా ఉన్నారు.

➡️