టోక్యోలోని హనెడా విమానాశ్రయ రన్‌వే తిరిగి ప్రారంభం

Jan 8,2024 16:24 #collision, #Tokyo

 టోక్యో :    టోక్యోలోని హనెడా విమానాశ్రయం రన్‌వేను వారంరోజుల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభించారు. మానవ తప్పిదం కారణంగా గతవారం జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం, కోస్ట్‌గార్డ్‌ విమానాలు రన్‌వైపై ఢకొీన్న సంగతి తెలిసిందే. జనవరి 2 సాయంత్రం జెఎఎల్‌ 516 విమానం 379 మంది ప్రయాణికులు, ఫ్లైట్‌ సిబ్బందితో వస్తున్న విమానం టేకాఫ్‌ కోసం సిద్ధమవుతున్న కోస్ట్‌ గార్డ్‌ విమానం వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది మరణించారు. మరమ్మత్తుల కోసం రన్‌వేను అధికారులు మూసివేశారు. విమానాల తాకిడి అధికమవడంతో సుమారు 1200 విమానాలను రద్దు చేశారు. సోమవారం తెల్లవారుజామున రన్‌వేను తెరిచారని, విమానాశ్రయం పూర్తి కార్యకలాపాలకు సిద్ధంగా ఉందని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.

➡️