ఉక్రెయిన్‌ దాడిలో నౌక ధ్వంసం : రష్యా రక్షణ శాఖ

Dec 26,2023 16:02 #Defense Ministry, #russia, #Ukrain

మాస్కో :    ఉక్రెయిన్‌ బలగాలు జరిపిన వైమానిక దాడిలో క్రిమియాలోని రష్యా నౌక ధ్వంసమైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఫియోడోసియా నగరంలో ల్యాండ్‌ చేసిన నొవొచెర్కాస్క్‌ నౌకను ఉక్రెయిన్‌ విమానం ప్రయోగించిన క్షిపణులు ఢ కొట్టాయని పేర్కొంది. దాడి సమయంలో రెండు ఉక్రెయిన్‌ ఫైటర్‌జెట్‌లను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.

గత కొన్ని నెలలుగా, ఉక్రెయిన్‌ దళాలు అధికంగా సముద్ర డ్రోన్‌లను వినియోగించి క్రిమియా పై దాడులు చేపట్టాయని అన్నారు.  నల్లసముద్రంలో నావిగేషన్‌ను పునరుద్ధరించడానికి ఉక్రెయిన్‌ను అనుమతించడంతో పాటు మిలియన్‌ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి అనుమతించడంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ దాడులకు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. నౌక దెబ్బతిన్న దానిపై నివేదిక లేదు. అయితే ఓడరేవు ప్రాంతంలో విస్తృతంగా మంటలు వస్తుండటాన్ని ఉక్రెయిన్‌ మీడియా ప్రసారం చేసింది.

➡️