ఫిలిప్పైన్స్‌లో తీవ్ర భూకంపం

Jan 10,2024 08:27 #Earthquake

మనీలా : దక్షిణ ఫిలిప్పైన్స్‌ తీర ప్రాంతంలో మంగళవారం భూకంపం సంభవించింది. దీఁ తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.7గా నమోదైంది. అయితే ఇప్పటివరకఁ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదఁ అధికారులు తెలిపారు. మైండ్‌నావో ద్వీపంలో సారంగాఁ ముఁ్సపాలిటీకి ఆగేయంగా వంద కిలోమీటర్ల దూరంలో భూమిలో 70 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం వుందఁ అమెరికా భూగర్భ సర్వే అధికారులు తెలిపారు. సునామీ ముప్పేమీ లేదఁ అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ తెలిపింది. పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ మీదున్న ఫిలిప్పైన్స్‌లో భూకంపాలు చాలా సర్వసాధారణం. అయితే వీటిల్లో చాలా ప్రకంపనలు ప్రజలకఁ తెలియకఁండా చాలా బలహీనంగా నమోదవుతాయి. గత నెల్లో కూడా ఇదే దీవిలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించగా, ముగ్గురు చఁపోయారు.

➡️