సరిహద్దుల్లో కంచెను తొలగించాలి 

Jan 24,2024 10:28 #America, #Border Dispute, #Mexico
supreme-court-allows-federal-agents-to-cut-razor-wire-at-us-mexico-border

టెక్సాస్‌ ప్రభుత్వానికి సుప్రీం రూలింగ్‌

మెక్సికో సిటీ : మెక్సికోతో గల సరిహద్దులో టెక్సాస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేజర్‌ వైర్‌ కంచెను కట్‌ చేయడాన్ని సరిహద్దు గస్తీ ఏజెంట్లు పునరుద్ధరించవచ్చని అమెరికా సుప్రీం కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. దేశంలోకి శరణార్ధులు, మైగ్రేంట్లు రాకుండా నిరోధించేందుకు టెక్సాస్‌ ప్రభుత్వం ఈ కంచె నిర్మాణాన్ని చేపట్టింది. కాగా, 5-4 ఓట్ల తేడాతో సోమవారం వెలువడిన ఈ రూలింగ్‌ బైడెన్‌ సర్కార్‌కు విజయంగా కనిపిస్తోంది. గత నెల్లో కంచెను కట్‌ చేయడాన్ని ఆపాలంటూ ఫెడరల్‌ అప్సీల్స్‌ కోర్టు, ఏజెంట్లకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సాగుతున్న న్యాయ పోరులో తాజాగా ఈ తీర్పు వెలువడింది. మెక్సికోతో 46 కిలోమీటర్ల పొడవునా గల సరిహద్దులో రేజర్‌ వైర్‌తో కంచెను నిర్మించాలంటూ టెక్సాస్‌ రిపబ్లికన్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌ ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్ళుగా ఈ నిర్మాణం సాగుతోంది. ఈ కంచెను దాటడానికి ప్రయత్నించిన అనేకమంది గాయపడ్డారు. నెత్తురోడే గాయాల పాలయ్యారు. సాధారణంగా ఫెడరల్‌ ప్రభుత్వ అధీనంలోనే సరిహద్దు నియంత్రణ వుంటుంది. ఈ కంచె వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని అమెరికా న్యాయ విభాగం వాదిస్తోంది. దీనివల్ల సరిహద్దుల్లో గస్తీ నిర్వహించే బలగాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైట్‌హౌస్‌ ప్రతినిధి ఏంజెలో ఫెర్నాండెజ్‌ హెర్నాండెజ్‌ తెలిపారు.

➡️