Road accident -అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

పర్చూరు (బాపట్ల) : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడ గ్రామానికి చెందిన ఆచంట రేవంత్‌ (22) అనే యువకుడు మఅతి చెందారు. బోడవాడకు చెందిన ఆచంట రఘు, వరలక్ష్మిల కుమారుడు రేవంత్‌ చైన్నైలో బిటెక్‌ పూర్తిచేసుకొని గత సంవత్సరం డిసెంబర్‌లో ఎంఎస్‌ కోసం అమెరికాకు వెళ్లారు. వాషింగ్టన్‌ డకోట స్టేట్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. రేవంత్‌ తల్లి కొన్నాళ్ల క్రితం మరణించగా, అతని తండ్రి ఆచంట రఘుబాబు ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు. మృతుడి బంధువుల వివరాల మేరకు … భారత కాలమాన ప్రకారం … మంగళవారం తెల్లవారుజామున రేవంత్‌ తన ముగ్గురు స్నేహితులతో కలసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో ప్రయాణిస్తుండగా.. వాతావరణం ఒక్కసారిగా మారింది. మైనస్‌ డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదు కావడంతో రోడ్డుపై గడ్డకట్టిన మంచు, దట్టమైన పొగ కారణంగా కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రేవంత్‌ అక్కడికక్కడే మఅతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రేవంత్‌ మరణవార్త విన్న బంధువులు, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు. దీంతో బోడవాడలో తీవ్ర విషాదం నెలకొంది.

➡️