లండన్‌ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ

Apr 7,2024 09:23

లండన్‌ : లండన్‌లోని ఎయిర్‌పోర్టులో ఓ విమానం పొరపాటున మరో విమానాన్ని ఢీకొట్టింది.. అయితే ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు. వారిలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలూ కాలేదని.. ప్రత్యామ్నాయ విమానాన్ని అందించామని బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

బ్రిటన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూలో… గత శనివారం వర్జిన్‌ అట్లాంటిక్‌ బోయింగ్‌ 787 విమానం.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఎయిర్‌బస్‌ ఎ 350 విమానాన్ని పొరపాటున ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని ఏవియేషన్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయ బృందం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి ఫైర్‌ ఇంజిన్లు కూడా చేరుకున్నాయి. ఇంజినీరింగ్‌ బఅందాలు విమానాలను పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వాటిని సర్వీసు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రభావం కస్టమర్ల మీద పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ విమానం అందించినట్లు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

➡️