కదం తొక్కిన యువతబ్రిగేడ్‌ సలాం…

Jan 8,2024 08:03 #DYFI, #Kolkata

ఇసుకేస్తే రాలనంత జనం

డి వై ఎఫ్‌ఐ మహా ర్యాలీ గ్రాండ్‌ సక్సెస్‌

కొల్‌కతా: యువత పెద్దయెత్తున పోటెత్తడంతో కొల్‌కతా బ్రిగేడ్‌ మైదానం జన సంద్రంగా మారింది. అందరికీ ఉపాధి, విద్య, కల్పించాలని, అవినీతి, మత విద్వేషాలను రూపుమాపాలని నినదిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో యాభై రోజులుగా రాష్ట్రంలోని 22 జిల్లాల మీదుగా 2,400 కి.మీ పొడవునా సాగిన సుదీర్ఘ ‘ఇన్సాఫ్‌ యాత్ర’ పతాక సన్నివేశంగా నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి ఇసుకవేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. గత ఏడాది నవంబరు3న కూచ్‌ బిహార్‌లో మొదలైన ఈ యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. దేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతీస్తున్న కేంద్రంలోని మతతత్వ బిజెపిని, బెంగాల్‌లో హింస, అవినీతికి కేరాఫ్‌గా మారిన మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని, బెంగాల్‌ పునరుజ్జీవనానికి వామపక్షాలను బలపర్చాలని ఈ మహా ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన వక్తలు పిలుపునిచ్చారు.

➡️