కవితకు వైద్య పరీక్షలు

Mar 16,2024 10:45 #Medical tests, #MLC Kavitha

ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం రాత్రి ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఇక్కడి ప్రత్యేక సెల్‌లో ఆమెను ఉంచినట్టు సమాచారం. శనివారం ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10.30 గంటల తర్వాత రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు. కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం భారీ భద్రత మధ్య బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 8.45 గంటలకు విమానంలో ఢిల్లీ తరలించిన విషయం తెలిసిందే.

➡️