చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయండి-సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌

Jan 24,2024 22:29 #bail, #cancelled, #Chandrababu Naidu

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఐఆర్‌ఆర్‌ కేసులో ఈనెల 10న చంద్రబాబుకు రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పును ఏపి ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పిటిషన్‌ ఈనెల 29న విచారణకు వచ్చే అవకాశం ఉంది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కేసులో అక్రమాలు జరిగాయని జగన్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో స్కాం జరిగిందని సిఐడి కేసు నమోదు చేసింది.

➡️