ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని మహువాకు నోటీసులు 

Dec 12,2023 17:12 #Mahua Moitra

 న్యూఢిల్లీ :   ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ టిఎంసి నేత మహువాకు నోటీసులు అందినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. ఆమె అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ మహువాకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నాయి. 30 రోజుల గడువు ఇచ్చినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

వ్యాపారవేత్త నుండి నగదు తీసుకుని మహువా మొయిత్రా  పార్లమెంటులో ప్రశ్నలు అడిగారంటూ బిజెపి ఆరోపించింది.  ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ ఆమెను బహిష్కరించాల్సిందిగా నివేదిక సమర్పించింది. ఈ నివేదికకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.  దీంతో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు గతవారం స్పీకర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.     లోక్‌సభ  తనపై విధించిన అనర్హతవేటుని సవాలు చేస్తూ  సోమవారం మహువా  సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

➡️