యుసిసి ఆమోదం కోసం

Feb 5,2024 10:51 #UCC, #Union Civil Code, #Uttarakhand
Special sessions of Uttarakhand Assembly from today

నేటి నుంచి ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

డెహ్రాడూన్‌ : సోమవారం నుంచి ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి)ని ఆమోదించుకోవాలని ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ థామి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర క్యాబినెట్‌ ఈ ముసాయిదాకు ఆమోద ముద్ర వేసింది. దీంతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో యుసిసి తుది ముసాయిదాను ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం చేసింది. ఆదివారం ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ధామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముసాయిదాకు ఆమోద ముద్ర లభించింది. నాలుగు సంపుటాల్లో 740 పేజీలతో ఉన్న యుసిసి తుది ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి రంజనా ప్రకాశ్‌ దేశారు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్యానల్‌ ఈ నెల 2న ముఖ్యమంత్రి ధామికి అందజేసిన సంగతి తెలిసిందే.

➡️