Ram Mandir: గర్భగుడిలోకి వర్షపు నీరు

అయోధ్యలో రామ మందిరం పరిస్థితి
పై కప్పు నుండి లీకవుతోందన్న ప్రధాన పూజారి

అయోధ్య: వానొస్తే అయోధ్యలో రామ మందిరం చిత్తడి చిత్తడిగా తయారవుతోంది. ఇటీవల కురిసిన ఒక మోస్తరు వర్షానికే పై కప్పు నుండి వర్షపు నీరు లీక్‌ కావడం ప్రారంభించిందని ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ సోమవారం ఫిర్యాదు చేశారు. ఆలయ పై భాగాన్ని సరిగ్గా నిర్మించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. నిర్మాణ దశలో ఉన్న సమస్యలేంటో గుర్తించి ఒకట్రెండు రోజుల్లా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దీనిని సత్వరమే పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో గర్భ గుడిలో పూజలు చేయడం కూడా కష్టమవుతుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయం ప్రారంభించి నాలుగు నెలలు కూడా తిరగక ముందే లీకేజీలు ఏర్పడడం తీవ్ర అలయ నిర్మాణంలో బిజెపి అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కాకున్నా హడావుడిగా జనవరి 22న ప్రారంభించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తన ప్రభుత్వ ఘనతగా ఎన్ని కల్లో ప్రచారం చేసుకున్నారు. అయినా, అయో ధ్యకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫైజా బాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి ఓటమి పాలైంది. వర్సా కాలం రావడంతో ఆలయ నిర్మాణంలొ లోపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మొదటి వర్షానికే గర్భగుడిలో పైకప్పు నుంచి నీరు కారడం ప్రారంభించింది. పైకప్పు నుండి నీటిని బయటకు తీయడానికి సరైన మార్గం కూడా లేదని పూజారి చెప్పారు. ఆలయ పూజారి చేసిన ఫిర్యాదుపై రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన నృపేంద్ర మిశా స్పందిస్తూ డిజైన్‌ లేదా నిర్మాణ సమస్య ఏమీ లేదని అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం బిజెపి అవినీతికి మరో ఉదాహరణ అని కాంగ్రెస్‌ విమర్శించింది. అది అమరవీరుల శవ పేటిక కావచ్చు, దేవుడి గుడి కావచ్చు కాదేజీ విజెపి అవినీతికి అనర్హం అన్నట్లుగా పరిస్థితి తయారైందని యుపి కాంగ్రెస్‌ చీఫ్‌ అజరు రారు వ్యాఖ్యానించారు.

➡️