రాహుల్ భద్రతపై అమిత్ షాకు లేఖ రాసిన ఖర్గే

Jan 24,2024 11:08 #Assam, #Rahul Gandhi

ఢిల్లీ: అస్సాంలో  రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అస్సాంలో  భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అనేక భద్రతా లోపాలు వెలుగుచూశాయని ఖర్గే వివరించారు.  పలు అంశాలను తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా, జనవరి 22న నాగావ్ జిల్లాలో రాహుల్ గాంధీ కాన్వాయ్ ని బిజెపి  కార్యకర్తలు అడ్డుకున్నారని, వారు రాహుల్ గాంధీకి అత్యంత సమీపానికి వచ్చారని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.  ఓ జాతీయ స్థాయి నేత కాన్వాయ్ లోకి ఇతరులు చొరబడి సమీపానికి రావడం అత్యంత అభద్రతో కూడిన పరిస్థితి అని వివరించారు. ఇంత జరుగుతున్నా అస్సాం  పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారని, కొన్నిసార్లు పోలీసులే దగ్గరుండి బిజెపి  కార్యకర్తలను రాహుల్ కాన్వాయ్ లోకి పంపించారని ఖర్గే పేర్కొన్నారు.   ఇప్పటివరకు అస్సాం  పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. రాహుల్ యాత్ర ముందుకు సాగేకొద్దీ… ముప్పు అధికమవుతోందని,  ఇకనైనా మీరు జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరారు.  రాహుల్ యాత్రకు తగిన భద్రత కల్పించేలా అస్సాం  ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, డిజిపిలకు  దిశానిర్దేశం చేయాలని ఖర్గే తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

➡️