వాళ్లు ఆటపట్టించారు.. అవి వేధింపులు కావు : బాంబే హైకోర్టు తీర్పు

ముంబయి : ఓ మహిళను ఆమె భర్త, అత్త, మరిది కలిసి మానసికంగా వేధించడంపై, సదరు మహిళ ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంపై బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. 1993లో పెళ్లయినప్పటి నుంచి ఆమెకు వంట పని, ఇంటి పని రాదని ఈ ముగ్గురూ వేధించడం వల్లనే 1994 ఏప్రిల్‌లో ఆమె నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారని ప్రాసిక్యూషన్‌ ఆరోపించారు. అత్తింటివారు రూ.10,000 కట్నం కావాలని కూడా ఆ మహిళపై ఒత్తిడి చేసినట్లు వివరించారు. ఈ కేసుపై ఒక సెషన్స్‌ కోర్టు 2001లో పై ముగ్గురినీ దోషులుగా తేల్చింది. అయితే ఔరంగాబాద్‌ ధర్మాసనం ఈ కేసుపై మాట్లాడుతూ … మృతురాలిని వారే చంపినట్లు, ఆత్మహత్యకు పురిగొల్పినట్లు సాక్ష్యాధారాలు లేవని కొట్టిపారేసింది. వాళ్లు ఆమెను ఆటపట్టించారనీ, కేవలం ఆటపట్టించినంత మాత్రాన దానిని మానసిక వేధింపుగా పరిగణించలేమని చెబుతూ తీర్పునిచ్చింది. ఆ ముగ్గురినీ నిర్దోషులుగా విడిచిపెట్టింది.

➡️