పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం.. ఎనిమిది మంది అధికారుల సస్పెన్షన్‌

న్యూఢిల్లీ :   పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటనపై గురువారం లోక్‌సభ సెక్రటేరియట్‌ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది లోక్‌సభ సిబ్బందిని సస్పెండ్‌ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సస్పెండ్‌ అయిన భద్రతా సిబ్బందిలో రాంపాల్‌, అరవింద్‌, వీరదాస్‌, గణేశ్‌, అనిల్‌, ప్రదీప్‌, విమిత్‌, నరేంద్ర ఉన్నారు. బుధవారం లోక్‌సభలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే.

ప్రధాని ప్రత్యేక సమావేశం

పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటనపై ప్రధాని మోడీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మంత్రులు ప్రహ్లాద్‌ జోషీ, అనురాగ్‌ ఠాకూర్‌, పీయూష్‌ గోయల్‌, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి. నడ్డాలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

➡️