ఏడో దశలో 908 మంది అభ్యర్థులు

May 22,2024 23:38 #908 candidates, #seventh phase

ఎనిమిది రాష్ట్రాలు, 57 స్థానాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :జూన్‌ 1న జరగబోయే ఏడో, చివరి దశలో ఎనిమిది రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానాల్లో మొత్తం 908 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. 57 స్థానాలకు మొత్తం 2,105 నామినేషన్లు దాఖలు కాగా, 954 నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందాయి. నామినేషన్లు ఉపసంహరణ తరువాత 908 నామినేషన్లు మిగిలిన ఉన్నాయి. పంజాబ్‌(13)లో 328, ఉత్తరప్రదేశ్‌(13)లో 144, బీహార్‌(8)లో 134, పశ్చిమ బెంగాల్‌(9)లో 124, ఒరిస్సా(6)లో 66, జార్ఖండ్‌(3)లో 52, హిమాచల్‌ ప్రదేశ్‌(4)లో 37, చండీగఢ్‌(1)లో 19 మంది బరిలో ఉన్నారు.

➡️