బెంగళూరు శివార్లలో అగ్ని ప్రమాదం

Feb 19,2024 10:45 #Fire Accident, #Karnataka
A fire broke out on the outskirts of Bangalore
  • ముగ్గురి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలో ఒక పెర్‌ఫ్యూమ్‌ గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుంబలగోడు సమీపంలోని రామసముద్ర వద్ద ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గిడ్డంగి నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

➡️