లైంగిక దాడిని అడ్డుకున్నందుకు యువతి హత్య

May 15,2024 18:17 #Karnataka, #Murder

బెంగళూరు : తనపై జరుగుతున్న లైంగిక దాడిని అడ్డుకోవడమే ఆ యువతి చేసిన నేరంగా మారింది. లైంగిక దాడిని అడ్డుకున్నందుకు ఒక యువతిని ఒక యువకుడు హత్య చేసిన ఘటన కర్ణాటకలోని హుబ్బల్లి జిల్లాలో జరిగింది. జిల్లాలోని వీరాపూర్‌ ఓని గ్రామానికి చెందిన 21 ఏళ్ల విశ్వ అలియాస్‌ గిరీష్‌ సావంత్‌, పొరుగింటి యువతి అంజలి అంబిగేరా (20)ను ప్రేమ పేరుతో వేధించేవాడు. బుధవారం తెల్లవారుజామున ఆమె ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. దీంతో గిరీష్‌ ఆగ్రహానికి గురై.. అంజలిని కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అంజలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న గిరీష్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

➡️