కేజ్రీవాల్‌ అభ్యర్థనను తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్‌

 న్యూఢిల్లీ :   పార్లమెంట్‌ ఎగువ సభలో ఆప్‌ మధ్యంతర నేతగా రాఘవ్‌ చద్దాను నియమించాలన్న ఆప్‌ అభ్యర్థనను రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ తిరస్కరించారు. విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు రాజ్యసభ చైర్మన్‌ లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. పార్లమెంటు (సౌకర్యాలు) చట్టం 1998 లోని గుర్తింపు పొందిన పార్టీల నేతలు మరియు చీఫ్‌ విప్‌ నిబంధనలు మరియు దానికింద అమలు చేసిన నిబంధనలకు లోబడి ఈ ఎంపిక ఉంటుంది. ఈ విజ్ఞప్తి చట్టానికి అనుసరించిలేదని, ఇది ఆమోదయోగ్యం కాదని ధన్‌ఖర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఫ్లోర్‌ లీడర్‌ సంజయ్  సింగ్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నందున రాఘవ్‌ చద్దాను రాజ్యసభలో ఆప్‌ తాత్కాలిక నేతగా నియమించాలని ఈ నెల ప్రారంభంలో కేజ్రీవాల్‌ రాజ్యసభ చైర్మన్‌ను కోరారు. నిబంధనలు పేరుతో కేజ్రీవాల్‌ అభ్యర్థనను ధన్‌ఖర్‌ తిరస్కరించడంతో.. రాజ్యసభలో ఆప్‌ నేతగా సంజయ్  సింగ్‌ కొనసాగనున్నారు.

➡️